1➤ సామెతల గ్రంథ రచయిత ఎవరు?
,=> సొలొమోను (1:1)
2➤ తెలివికి మూలం ఏమిటి?
,=> యెహోవాయందు భయభక్తులు (1:7)
3➤ 'దొరికినవారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును'. అదేమిటి?
,=> దేవుని వాక్యం (4:22)
4➤ ఎక్కడనుండి సోమరి జ్ఞానం పొందగలడు?
,=> చీమలు (6:6)
5➤ మనిషి నడతలను గుర్తించేదెవరు?
,=> యెహోవా (5:21)
6➤ మనం త్రోవలో నడుస్తున్నప్పుడు మనల్ని నడిపించేదేమిటి?
,=> దేవుని వాక్యం (6:22)
7➤ మరణంనుండి మనల్ని రక్షించేదేమిటి?
,=> నీతి (11:4)
8➤ ముత్యములకంటే శ్రేష్టమైనది ఏది?
,=> జ్ఞానం (8:11)
9➤ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది ఎవరు?
,=> వివేకంలేని సుందర స్త్రీ (11:22)
10➤ గద్దింపుకు లోబడనివాడు ఎవరు?
,=> అపహాసకుడు (13:1)
11➤ తన పిల్లల పిల్లలకు ఆస్తిని వదిలేవాడు ఎవరు?
,=> మంచివాడు (13:22)
12➤ ఎముకలకు కుళ్ళుగా ఉండేది ఏమిటి?
,=> మత్సరం/ఈర్ష్య (14:30)
13➤ యెహోవా చేతిలో ఎవరి హృదయం నీటి కాలువలవలె ఉంటుంది?
,=> రాజు హృదయం (21:1)
14➤ వివేకంగల వ్యక్తి ఎవరు?
,=> శాంతగుణంగల వ్యక్తి (17:27)
15➤ ఏడుసార్లు పడినా కూడా తిరిగి లేచేది ఎవరు?
,=> నీతిమంతుడు (24:16)
16➤ ఏ గాలి వానను తెస్తుంది?
,=> ఉత్తర గాలి (25:23)
17➤ సమయోచితంగా పలుకబడిన మాట ఎలా ఉంటుంది?
,=> బంగారు పండ్లు (25:11)
18➤ జలగయొక్క ఇద్దరు కూతురులెవరు?
,=> ఇమ్ము, ఇమ్ము (30:15)
19➤ అది చిన్నదైనా చాలా తెలివి గలది. అదేమిటి?
,=> చీమ (30:25)
20➤ సందుల్లో తమకు నివాసాన్ని కల్పించుకొనేవి ఏవి? చిన్న కుందేళ్ళు (30:26) రాజుల గృహాల్లో కూడా జీవించేదేమిటి?
,=> బల్లి (30:28)
21➤ కోపాన్ని రేపితే, అది ఏమి తెస్తుంది?
,=> కలహం (30:33)
22➤ వ్యాపారపు ఓడలవలె ఉన్నది ఎవరు?
,=> గుణవతియైన స్త్రీ (31:14)
23➤ సొలొమోను దృష్టిలో మోసకరమైనదేమిటి?
=> అందం (31:30)